డంపింగ్ యార్డ్లో దుర్వాసన... ప్రజలకు నరకయాతన - Stink in the dumping yard news
కడప జిల్లా రాజంపేట పట్టణంలో ప్రతిరోజు సుమారు 35 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. 25 టన్నుల వరకు ప్రతిరోజు సేకరించి డంపింగ్ యార్డులో తరలిస్తున్నారు. చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్ డ్రైవర్లు క్రమ పద్ధతి లేకుండా ఇష్టం వచ్చిన చోట డంప్ చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. రహదారి పక్కన వేయడం వల్ల దుర్వాసన వస్తోందని.. దోమలు అధికంగా ఉన్నాయని అన్నారు. పిల్లలువిష జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన చెందారు. పురపాలక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించని కారణంగా.. వాహనాలను అడ్డుకున్నట్టు చెప్పారు.