ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మహిళా విభాగంలో కడప జిల్లాకు చెందిన విద్యార్థిని రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించింది. వేముల మండలం అమ్మయ్యగారిపల్లె కు చెందిన మమత 97 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు వెంకట కృష్ణారెడ్డి, వనిత ఇద్దరు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.
తల్లిదండ్రులు తనను చదివించడానికి బాగా కష్టపడే వాళ్లని .. వారి కష్టం వృథా కాకుండా పట్టుదలతో చదివి మొదటి ర్యాంకు సాధించానని మమత అన్నారు. చిన్నప్పటి నుంచి వేంపల్లిలోని ప్రైవేట్ పాఠశాలలోనే చదువుకున్నానని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సహకారంతో.. ఉపాధ్యాయుల శిక్షణతోనే మొదటి ర్యాంకు సాధించగలిగానని ఆనందం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి. రోజూ ఒక గుడ్డు ఎందుకు తినాలంటే.?