ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక భరోసా, ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య తెలిపారు. బుధవారం కడప జిల్లా మైదుకూరులో అసోసియేషన్ ఏర్పాటు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు, మెడికల్ అన్ఫిట్ అయిన చోదకులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు మొదలయ్యాయి అని పేర్కొన్నారు. గతంలో లాగా ఆర్టీసీ ఉద్యోగులకు అన్ లిమిటెడ్ హెల్త్ స్కీమ్ అమలవుతుందని చల్లా చంద్రయ్య చెప్పారు.
'ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు' - kadapa district latest news
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య చెప్పారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు మొదలుపెట్టినట్లు వెల్లడించారు.