కడప కలెక్టరేట్లో రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. గ్రామ సచివాలయ వ్యవస్థను పటిష్ట పరిచి ప్రజలకు కావలసిన సేవలన్నీ అందుబాటులోకి తెచ్చామన్నారు. కడప గోకుల్ కూడలి వద్దనున్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్ర అవతరణకు ఎంతో కృషి చేసిన ఆయనను మనమంతా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
ఇలాంటి గొప్ప వ్యక్తుల ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. జమ్మలమడుగు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. వైకాపా నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపు సాగుతోందని కొనియాడారు.
ఇదీ చదవండి: