కడప జిల్లా రాజంపేట పట్టణంలో కొత్తగా నిర్మించిన ఓం శాంతి భవనాన్ని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ప్రారంభించారు. కులమత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని కోరారు. ఆధ్యాత్మిక విలువలు పెంచుకోవాలని సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించినప్పుడే...రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని మేడా తెలిపారు. కార్యక్రమంలో పిల్లల ఆట పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇదీ చూడండి: గండి వీరాంజనేయ స్వామి దేవాలయం... తితిదేలో విలీనం