అసాంఘిక కార్యకలాపాల విషయంలో పోలీసు అధికారుల పాత్ర ఉందని తెలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులు పరిశీలించారు మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్లపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. చోరీకేసులో సొత్తు త్వరగా రికవరీ చేయాలని ఆదేశించారు. చోరీలు జరగకుండా పోలీసు గస్తీ ముమ్మరంగా నిర్వహించాలని చెప్పారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. స్పందన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని డీఎస్పి సుధాకర్, సీఐ విశ్వనాథ్ రెడ్డిలను ఎస్పీ ఆదేశించారు.
ఇవీ చదవండి