ETV Bharat / state

రాజంపేటలో విషాదం- ఒకే రోజు తల్లి, తనయుడు మృతి - son_and_mother_died_in_same_day_in_kadapa_rajampeta

నవమాసాలు మోసి కనిపించిన బిడ్డ ఇక లేడని తెలుసుకున్న ఆ తల్లి మనసు తల్లడిల్లింది. బిడ్డ హత్యకు గురైన విషయం తెలుసుకున్న మరుక్షణం కుప్పకూలిపోయింది. కొడుకు మృతదేహం ఇంటికి చేరకముందే ఆమె మృత్యు ఒడిలోకి జారుకుంది.

రాజంపేటలో ఒకే రోజు తల్లి, కుమారుడు మృతి
author img

By

Published : May 5, 2019, 6:35 AM IST

కడప జిల్లా రాజంపేట కనకమ్మ వీధిలో విషాదం నెలకొంది. ఒకే రోజు తల్లి, కుమారుడు మృతి చెందారు. బాలాజీని గత నెల 29న కొందరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి భాగ్యమ్మకు(70) కుమారుడి మరణవార్త విని తట్టుకోలేకపోయింది. తీవ్ర మనోవేదనకు గురై కన్నుమూసింది.
మృతుడు బాలాజీకి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఏ ఆధారం లేని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, స్థానికులు కోరుతున్నారు.

రాజంపేటలో ఒకే రోజు తల్లి, కుమారుడు మృతి

ఇవీ చూడండి-అధికారుల నిర్లక్ష్యం... పాపం. ఆ గేదెకు శాపం!!

Intro:గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలోని కేసానుపల్లి గ్రామంలో మే నెల 6వ తేదీన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రీపోలింగ్ నిర్వహించనున్నారు. అందుకుగాను శాంతిభద్రతల దృష్ట్యా పోలింగ్ కు 48 గంటల ముందు నుండి గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు గ్రామంలో పర్యటించవద్దని పోలీసుశాఖ అన్ని రాజకీయపార్టీ నేతలకు తెలిపింది.

Body:అయితే శనివారం కేసానుపల్లి గ్రామంలో తెదేపా నాయకులు సమావేశం ఏర్పాటు చేస్తున్నారంటూ పోలీసులకు సమాచారం అందడంతో నలుగురు తెదేపా నాయకులను అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట తెదేపా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు, పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని రూరల్ సిఐ చిన మల్లయ్య తో చర్చించారు.

Conclusion:కేసానుపల్లి రీపోలింగ్ కేంద్రంలో ఎజెంట్లను ఏర్పాటు చేసుకునేందుకు మాత్రమే, అదీ ఆ గ్రామంలో ఓటు హక్కు కలిగివున్నవారు మాత్రమే ఎజెంట్లుగా నియమించాలన్నారు కాబట్టి మేము గ్రామానికి రావలసి వచ్చింది తప్ప గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదని అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకులు చెబుతున్నారు. రూరల్ సిఐ చినమల్లయ్య అదుపులోకి తీసుకున్న నలుగురు తెదేపా నాయకులపై బైండోవర్ కేసులు నమోదు చేసి పంపించారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052,
8500512909.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.