విద్య, ఉపాధి కోసం పోరాటాలు చేయాలని ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు వి.పి.సాను పిలుపునిచ్చారు. కడప ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాను.. దేశంలో పేద, బడుగు బలహీన వర్గాలకు ఉపాధి అవకాశాలు అందనంత ఎత్తులో ఉన్నాయని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యను పూర్తిగా కాషాయం చేసేందుకు కేంద్రం నూతన విద్యా విధానం ఉందన్నారు.
స్వతంత్ర పోరాట యోధుడు భగత్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. దేశంలో వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి... రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని మండిపడ్డారు. మార్చి 23న భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని సాను తెలిపారు.
ఇదీ చదవండి: