ETV Bharat / state

RATION RICE SEIZED: బద్వేలులో 30 టన్నుల రేషన్​ బియ్యం పట్టివేత - కడప జిల్లా వార్తలు

బద్వేలులో 30 టన్నుల రేషన్​ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అక్రమంగా రేషన్​ బియ్యాన్ని తరలిస్తున్న లారీని సీజ్​ చేసి, డ్రైవర్​ను అరెస్టు చేశారు.

రేషన్​ బియ్యం పట్టివేత
రేషన్​ బియ్యం పట్టివేత
author img

By

Published : Aug 11, 2021, 5:42 PM IST

కడప జిల్లా బద్వేలులో మైదుకూరు నుంచి నెల్లూరుకి అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం, లారీని రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించి పట్టుకున్నారు. సుమారు 30 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మైదుకూరు పట్టణంలోని లక్ష్మీ నరసింహ రైస్ మిల్లు నుంచి చౌకబియ్యం లారీలో తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు వెళ్లి గుంతపల్లి క్రాస్​రోడ్డు వద్దకు వెళ్లి తనిఖీలు చేపట్టగా.. లారీలో 600 బస్తాలు ఉన్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా గోస్పాడు గ్రామానికి చెందిన డ్రైవర్ బాల హుస్సేన్​పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ రామచంద్ర తెలిపారు.

ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.