కడప జిల్లా బద్వేలు మండలంలోని లక్ష్మీ పాలెం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం... 15వ శతాబ్దంలో మట్లి తిరువేంగళనాధుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇంతటి శతాబ్దాల ఘన చరిత్ర ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయానికి.. కనీస వసతుల లేమి శాపంగా మారింది. భక్తులు వస్తే కాళ్లు కడుక్కునేందుకూ నీరు లేదు. ఆలయంలో ఉన్న బోరు ఎండిపోయింది. రెండేళ్లుగా అభిషేక పూజలు చేయాలన్నా... అర్చక స్వాములకు ఇబ్బందిగా మారింది. అనేక పర్యాయాలు దేవాదాయ శాఖ అధికారులకు తెలిపినా స్పందన లేదు. చివరికి.. ఆలయం నీటి సమస్య కారణంగా మూసివేయాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారానికి పాలకులు, అధికారులు, పాలకమండలి ప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఇదీ చూడండి ఆలయంలో చోరీ... సీసీటీవీ రికార్డ్ చేసింది!