సమాజంలో మహిళలు, అమ్మాయిలపై వివక్ష కొనసాగుతుండడం.. దురదృష్టకరమని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు తుపాకుల రామంజనేయరెడ్డి.. సేవ్ గర్ల్ చైల్డ్ & ఎడ్యుకేట్ పేరిట తుపాకుల మహేశ్ నిర్వహిస్తున్న ఆర్ట్స్ ఫ్యాక్టరీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సమాజంలో చిన్న చూపు చూస్తొన్న చిన్నారి బాలికలను కాపాడాలని పిలుపునిస్తూ... సంస్థ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా ప్రజా ప్రతినిధులు, సంఘ సేవకులు, సినీ ప్రముఖులను కలిసి వారి చిత్రాలను గీసి వారికే బహూకరిస్తున్నారు మహేశ్. ఈ కార్యక్రమంలో భాగంగా...సేవ్ గర్ల్ చైల్డ్ లోగోతో కూడిన పీవీ రమేష్ చిత్రాన్ని గీసి ఆయనకు బహుకరించారు. బాలికలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున తగు చర్యలు తీసుకోవాలని కోరగా...అందుకు రమేష్ సానుకూలంగా స్పందించారు. లఘు చిత్రాలు రూపొందించి.. ప్రభుత్వ పక్షాన ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు. సేవ్ గర్ల్ చైల్డ్ పేరిట మహేశ్ ఆర్ట్స్ సమాజంలో చేస్తోన్న సేవలను పీవీ రమేష్ అభినందించారు.
ఇవి చదవండి...ఈ చిన్నారి మరణానికి బాధ్యులెవరు?