కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ నూతన డైరెక్టర్‌గా కె. సంధ్యారాణి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆమె తిరుపతి పద్మావతి మహిళ యూనివర్సిటీలో రెక్టార్‌గా విధులు నిర్వహించారు. ప్రమోషన్లో భాగంగా ట్రిబుల్ ఐటీ ఛాన్సలర్ కేసీ రెడ్డి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి డైరెక్టర్‌గా సంధ్యారాణిని నియమించారు.
విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తానని సంధ్యారాణి అన్నారు. ఏ యూనివర్సిటీలోనైనా విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారని.. వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించి మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా యూనివర్సిటీలలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టిందన్నారు. విద్యార్థులలో నైపుణ్యాలను వెలికితీసి పరిశ్రమలకు కావలసిన విధంగా వారిని తీర్చిదిద్దడమే ఈ పథకం ఉద్దేశమని వివరించారు. విద్యార్థులు ఉద్యోగాలు సాధించేలా తన వంతు కృషి చేస్తానని సంధ్యారాణి అన్నారు.
ఇవీ చదవండి..