పులివెందుల పట్టణంలో తాము వేసిన రోడ్లే కనిపిస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పేర్కొన్నారు. వైకాపా హయాంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. వేల కోట్లు అప్పులు తెచ్చి చేసే కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరుస్తాయని అభిప్రాయపడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికుల మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ...: రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్ కేసులు..ఐదుగురు మృతి