జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించటంపై అధికారులు దృష్టి సారించారు. కడప జిల్లా రాజంపేట కూరగాయల మార్కెట్లోకి వినియోగదారులు ఎక్కువ సంఖ్యలో రావటంతో... పోలీసులు వాళ్లకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో మార్కెట్లను విశాలమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజంపేట మార్కెట్‌ను... ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి తరలించారు. అధిక ధరలకు కూరగాయలు అమ్మొద్దని, ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇవీ చదవండి: ప్రపంచ వ్యాప్తంగా 14,436కి చేరిన కరోనా మృతులు