కడప ఆర్టీసీ డిపోకు చెందిన సుధాకర్ అనే డ్రైవర్ బస్సు నడుపుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. తనకు తానుగానే అప్రమత్తమై.. సమయస్ఫూర్తితో బస్సును పక్కకు ఆపి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. కడప నుంచి రాజంపేటకు వెళ్తుండగా దారిలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు సుధకర్ను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఘటన జరిగినప్పుడు బస్సులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయట పడ్డారు. 55 సంవత్సరాలు దాటిన డ్రైవర్లను సుదూర ప్రాంతాలకు విధుల నిమిత్తం పంపించరాదన్న నిబంధన ఉన్నప్పటికీ డిపో అధికారులు ఉల్లంఘంచడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపించాయి. సుధాకర్ ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్నాడని, అతని డిపో పరిధిలోపే విధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: