ETV Bharat / state

బస్సును ప్లాట్ ఫాంపై నిలిపిన కాసేపటికే ఆర్టీసి డ్రైవర్ గుండెపోటుతో మృతి - kadapa district latest news

Rtc Driver Died : కడప ఆర్టీసీ డిపోలో విషాదం చోటు చేసుకుంది. రోజవారి విధుల్లో భాగంగా, ఎప్పటిలానే.. ఆర్టీసీ బస్సును ప్లాట్ ఫాం నిలిపాడు ఆ డ్రైవర్. ఆ కొద్దిసేపటికే డ్రైవర్ కు గుండెపోటు రావడంతో.. తోటీ సహచరులు హుటాహుటీన డ్రైవర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, డ్రైవర్ ఆసుపత్రికి రాకముందే చనిపోయారని వైద్యులు ప్రకటించారు.

గుండెపోటు
Rtc Driver Died
author img

By

Published : Dec 17, 2022, 5:02 PM IST

Rtc Driver Died : రోజువారి విధుల్లో భాగంగా.. బస్సును ప్లాట్ ఫారంపై పెట్టిన కొద్దిసేపటికే ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కడప ఆర్టీసీ డిపో చోటుచేసుకుంది. కడపకు చెందిన రాజగోపాల్ కడప ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఉదయం ఆయన విధుల నిమిత్తం గ్యారేజ్ కి వచ్చాడు. బస్సును తీసుకొని ఫ్లాట్ ఫారం వద్దకు వెళ్లాడు. ప్లాట్ ఫారంపై బస్సును పార్కింగ్ చేసిన కొద్దిసేపటికి రాజగోపాల్ గుండెపోటు రావడంతో వెంటనే స్థానికులు ఆర్టీసీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. బస్సు వెళ్తున్న సమయంలో గుండెపోటు వచ్చి ఉంటే పెను ప్రమాదం జరిగేదని, ఆర్టీసీ డ్రైవర్లు ఆరోగ్య సూత్రాలను తప్పకుండా పాటించాలని, చెడు అలవాట్లకు బానిసలు కావద్దని అధికారులు సూచించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.