కడప జిల్లా పులివెందులలో రెండు నెలల లాక్‌డౌన్ అనంతరం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. పులివెందుల డిపో నుంచి కడప నాన్ స్టాప్ సర్వీసును గురువారం పులివెందులలో మున్సిపల్ కమిషనర్, ఆర్టీసీ డిపో మేనేజర్, సీఐ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వరప్రసాద్ పునఃప్రారంభించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రయాణికులకు ముందుగా శానిటైజర్ స్ప్రే చేశారు. మాస్కులు లేనివారికి మాస్కులు కచ్చితంగా ధరించాలని సూచించారు. లేనిచో బస్సు లోనికి అనుమతి లేదని తెలిపారు. అలాగే భౌతిక దూరం పాటిస్తూ రిజర్వేషన్ కౌంటర్లో టిక్కెట్లు తీసుకోవాలని తెలియజేశారు. పులివెందుల డిపోలో గురువారం నుంచి 20 బస్సులను మూడు రూట్లలో మాత్రమే నడిపారు.
ఇదీ చదవండి :