రెండు నెలల తరువాత రవాణా శాఖ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో కడప రవాణా శాఖ కార్యాలయంలో ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ మెుదలయ్యింది. అభ్యర్థులకు థర్మల్ స్కానింగ్, శానిటైజ్ చేసిన తరువాతే కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. మెుదటి రోజు కావటంతో వాహనదారులు తాకిడి అంతంతమాత్రంగానే ఉంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో, ఉదయం 9 గంటల నుంచే పనులు ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలు పూర్తిగా పాటిస్తూ, కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆర్టీవో శాంతకుమారి వివరించారు.
ఇదీ చదవండి: ఉపాధి హామీ పనులపై వివాదం... ఐదుగురిపై కేసు నమోదు