కడప జిల్లా రాయచోటి పురపాలికలో జరిగిన ఎన్నికల్లో.. తెదేపా అభ్యర్థి ఖాదర్‌వలి కంటతడి పెట్టుకున్నారు. 25 వార్డులోని ఒకటో పోలింగ్ కేంద్రంలో వైకాపా కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని పోలీసులకు మొర పెట్టుకున్నారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తూ.. ఏకపక్షంగా అధికారపార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారంతట వారే ఓట్లు వేసుకోవడాన్ని అడ్డుకోవాలని పోలీసులను వేడుకున్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ఇంతటి దారుణం జరుగుతున్నా పోలీసులు సరిగా స్పందించకపోవడంపై ఖాదర్‌వలి ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలు బాగుపడవు అని ఏడుస్తూ.. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చారు. రాయచోటిలోని 23, 24, 25 వార్డుల్లోనూ ఇదే విధంగా జరిగిందని తెదేపా అభ్యర్థులు ఆరోపించారు.
ఇదీ చదవండి: