ETV Bharat / state

రేనాటి చోళులు కడపవాసులే

రేనాటి చోళులు కడప జిల్లా వాసులేనని శిలాశాసనాల ద్వారా పరిశోధకులు నిర్ధరణకు వచ్చారు. తొలి రాజధాని ఎరికల్ అయి ఉండొచ్చునని తెలిపారు. ఎరికల్ పేరు కాలక్రమేణా రూపాంతరం చెంది ఎర్రగుడిగా మారిందని పరిశోధక విద్యార్థి నాగదాసరి మునికుమార్‌ తెలిపారు.

Researchers have determined that the Renati Cholas were residents of Kadapa district

author img

By

Published : Jul 28, 2020, 9:45 AM IST

రేనాటి చోళులు కడప జిల్లా వాసులేనని, రేనాటి ధనుంజయుడి తొలి రాజధాని ఎరికల్‌ అయి ఉండొచ్చునని శిలాశాసనాల ద్వారా పరిశోధకులు నిర్ధరణకు వచ్చారు. ఎరికల్‌ పదం కాలక్రమేణా ఎరికల్లు, ఎరిగల్లు, ఎరికాల్వ, ఎరిగల్‌గా రూపాంతరం చెంది ఎర్రగుడి (ఎర్రని ఇటుకలతో నిర్మించిన పాత గుడి)గా మారిందని తెలిపారు. ఎర్రగుడి ప్రస్తుతం కమలాపురంలో ఉంది. రేనాటి చోళులు కర్ణాటకలోని నిడుగల్‌ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించారన్న గత అంచనాలకు భిన్నంగా తాజా శాసనాలు సూచిస్తున్నాయని పరిశోధక విద్యార్థి నాగదాసరి మునికుమార్‌ తెలిపారు.

కడప జిల్లా సిద్దవటం శివారులోని లంకమల అభయారణ్యంలోని ఇష్టకామేశ్వర నిత్యపూజస్వామి కోవెల పరిసరాల్లో లభ్యమైన శిలాశాసనాలను ఎపీగ్రఫీ డైరెక్టర్‌ మునిరత్నంరెడ్డి ఇటీవల అధ్యయనం చేశారు. ఆ వివరాలను కడప నివాసి మునికుమార్‌ ఇక్కడ వివరించారు. ఆయన బెంగళూరులోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ కళా కేంద్రంలో తాళపత్ర లిపిశాస్త్రంలో పరిశోధనలు చేస్తున్నారు. 1500 ఏళ్ల కిందట వెలసిన నిత్యపూజకోన చరిత్రను అధ్యయనం చేస్తూ రెండేళ్ల క్రితం సమీపంలోని పంచలింగాల గుడి పక్కన ఉన్న కొండపై నాలుగు పురాతన శాసనాలను గుర్తించారు. వీటిని మైసూరులోని భారత పురావస్తు శాఖ ఏపీగ్రఫీ అధికారులు తీసుకెళ్లి పరిశీలిస్తున్నారు.

ఇదీ చరిత్ర

నిత్యపూజస్వామికోనలో లభ్యమైన శాసనాలను భారత పురావస్తు శాఖ ఎపీగ్రఫీ అధికారులు 1810లో ముద్రించిన మద్రాసు గెజిట్‌లోని చరిత్ర అంశాలతో పోల్చి పరిశోధించారు. రెండు శాసనాల్లో లభించిన ఆధారాల మేరకు ఎరిగల్‌ దళపతి నరసింగుడు నిత్యపూజకోనకు అనుసంధానంగా పంచలింగాల గుడి నిర్మించాడు. ఎరికల్‌ ముత్తురాజు, రేనాటి ధనుంజయుడు జిల్లాలోని పెద్దచెప్పలి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. క్రీ.శ.7 శతాబ్దంలో సిద్దవటంపై ఆధిపత్యం కోసం బాణులు నిత్యపూజకోనలో రేనాటి చోళులపై యుద్ధానికి వచ్చారు. చోళుల సేనానిగా పద్మనాథజియ వ్యవహరించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి

ఆక్వా సాగుకు గడ్డుకాలం.. పడిపోతున్న ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.