ETV Bharat / state

ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు - crime news in kadapa district

కడప జిల్లాకు చెందిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్​ తెలిపారు. 2015 నుంచి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ...దుంగలను అక్రమంగా రవాణా చేస్తుండేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు.

red sanders smugglers
red sanders smugglers
author img

By

Published : Nov 19, 2020, 4:37 PM IST

పేరుమోసిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్​ తెలిపారు. కడప జిల్లా చాపాడు మండలానికి చెందిన స్మగ్లర్​ లాల్​ బాషాపై 15 కేసులు, అదే ప్రాంతానికి జాకీర్​పై 12 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వీరిద్దరూ 2015 నుంచి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ.. దంగులను అక్రమంగా రవాణా చేసేవారని వివరించారు.

కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల్లోనూ ఎర్రచందనం దందా సాగించేవారని అన్నారు. వీరిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారని పేర్కొన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని, సంబంధిత ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు.

ఇదీ చదవండి

మంత్రి కొడాలి నానిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఎస్‌ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.