ETV Bharat / state

కడపలో 29 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు..1.5 టన్నుల దుంగలు స్వాధీనం - కడపలో 29 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు న్యూస్

కడప జిల్లాలో 29 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.5 టన్నుల ఎర్రచందనం దుంగలు, 11 గ్రాముల బంగారు, 29 గ్రాముల వెండి స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.

కడపలో 29 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

author img

By

Published : Jan 2, 2021, 10:06 PM IST

కడప జిల్లా పోలీసులు మూడు వేర్వేరుచోట్ల ఎర్రచందనం స్మగ్లర్లపై దాడులు చేశారు. దాడుల్లో నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు మెుత్తం 29 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.5 టన్నుల ఎర్రచందనం దుంగలు, 11 గ్రాముల బంగారు, 29 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కడప జిల్లా ఖాదర్​పల్లెకు చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్​ దస్తగిరిరెడ్డితో పాటు 32 కేసుల్లో ముద్దాయిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న వెంకటసుబ్బయ్య అనే స్మగ్లర్ రాయచోటి, రాజంపేట, బద్వేల్ ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారు. తమిళనాడు నుంచి కూలీలను రప్పించి వారి ద్వారా ఎర్ర చందనం దుంగలను జిల్లా సరిహద్దులు దాటించేవారు.

ఈ మేరకు ఈ తెల్లవారుజామున అట్లూరు, గువ్వల చెరువు ఘాట్, వీరబల్లి, సుండుపల్లి అటవీ ప్రాంతాల్లో చెట్లను నరికించి తమిళనాడుకు అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేసిన పోలీసులు మెుత్తం 29 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఆరు కార్లను స్వాధీనం చేసుకొని నిందితులపై కేసులు నమోదు చేశారు.

ఇదీచదవండి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తండ్రీకొడుకులు మృతి.. మరో కుమారుడికి గాయాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.