ETV Bharat / state

కువైట్ నుంచి గన్నవరం..నేరుగా క్వారంటైన్ - hypochlorite

పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కడప జిల్లా వాసులు ఎట్టకేలకు జిల్లాకు చేరుకున్నారు. కువైట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ చేరుకొని అక్కడినుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. వారందరిని క్వారంటైన్​కు తరలించారు.

kadapa district
కువైట్ నుంచి వచ్చినవారికి క్వారంటైన్
author img

By

Published : May 22, 2020, 8:33 PM IST

గల్ఫ్ దేశాలకు వెళ్లిన కడప జిల్లావాసులు ఎట్టకేలకు జిల్లాకు చేరుకున్నారు. కువైట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ చేరుకొని అక్కడినుంచి రేణిగుంట విమానాశ్రయం వచ్చారు. అక్కడినుంచి 4 ప్రత్యేక బస్సుల ద్వారా కడప జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

బస్సు దిగిన జిల్లా వాసుల లగేజ్​కు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. జిల్లాలోని మండలాల వారీగా ఏర్పాటుచేసిన కౌంటర్ల వద్ద వాళ్ల పేర్లు నమోదు చేసుకుని కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కు తరలించారు. వీరిలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, చంటి పిల్లల తల్లులు, గర్భిణీలు ఉన్నారు. కువైట్ లో ఉంటున్న జిల్లా వాసుల్లో 112 మంది ప్రస్తుతం వచ్చారని ఆర్డీవో, డీఎస్పీ తెలిపారు. వీరికి కరోనా పరీక్ష నిర్వహించి అందులో పాజిటివ్ వస్తే కడప పాతిమా కళాశాలకు తరలిస్తామని, నెగటివ్ వస్తే ఇక్కడే 14 రోజులపాటు ఉంచుతామని అన్నారు. చాలామంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, కొందరు ఇంటి వద్ద వివిధ కార్యక్రమాల కోసం హాజరు కావాల్సి ఉందని తమ దృష్టికి తెచ్చారన్నారు. కరోనా పరీక్షలు నెగిటివ్ వస్తే వీరి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. క్వారంటైన్ లో ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించిందని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.

ఇది చదవండి జిందాల్ పరిశ్రమ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.