కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మానవ హక్కుల కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ ఆరోపించారు. పట్టణానికి చెందిన లక్ష్మీ నారాయణరావు అనే వ్యక్తిపై స్థానికంగా ఉన్న మాజీ ప్రజాప్రతినిధి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయగా... బాధితుడు ఇచ్చిన ఫిర్యాదును చించివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఫిర్యాదుదారుని నుంచి డబ్బులు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న జిల్లా పోలీసు అధికారులు విచారణ ప్రారంభించారు. లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి తప్పుడు ఫిర్యాదు చేశానని అధికారుల వద్ద ఒప్పుకోవాలని బెదిరించారని.. బాధితుడు ఒప్పుకోకపోవటంతో అతని ఇంటికి ఆకతాయిలను పంపించి గొడవలు చేస్తున్నారని చెప్పారు. జిల్లా పోలీస్ అధికారులే స్పందించి బాధితుడికి రక్షణ కల్పించాలని కోరారు.
ఇదీచదవండి.