ETV Bharat / state

వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించండి: అంజాద్ బాషా

author img

By

Published : Oct 7, 2020, 9:53 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వెలగపూడి నుంచి ఆయా జిల్లాల్లో ఉన్న వక్ఫ్ ఆస్తులపై జిల్లా రెవెన్యూ అధికారులు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, వక్ఫ్ బోర్డు ఇన్​స్పెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించండి : ఉపముఖ్యమంత్రి భాషా

రెవిన్యూ డివిజనల్ అధికారులు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, వక్ఫ్ బోర్డు ఇన్​స్పెక్టర్లు బాధ్యత వహించి వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణ, భూముల రక్షణ కోసం కంచె వేయడం, సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం చేయాలని ఆయన సూచించారు.

విలువైన భూములను గుర్తించాలి..

రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో వక్ఫ్ బోర్డుకు సంబంధించి ముఖ్యమైన విలువైన భూములను గుర్తించి వాటిని కాపాడాలన్నారు. సదరు భూముల ద్వారా ఆదాయం వచ్చేందుకు వాణిజ్య కాంప్లెక్స్​లను నిర్మించాలన్నారు. వక్ఫ్ బోర్డులకు సంబంధించి టాక్స్​లను కచ్చితంగా వసూలు చేసేందుకు నియమ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి నెలా ఒకసారి సమావేశం..

అన్యాక్రాంతం భూములుకు నోటీసులను జారీ చేసి వాటిని ఖాళీ చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులను అంజాద్​ బాషా ఆదేశించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆయా జిల్లాల్లో ఎంత మేర ఉన్నాయో తదితర వివరాల కోసం కమిటీని ఏర్పాటు చేసి వివరాలు సేకరించి ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలన్నారు. ప్రతి నెలలో ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని వివరాలు తెలపాలన్నారు.

అన్ని వివరాలు అప్​డేట్​..

సదరు వివరాలను ఆన్​లైన్​లో పొందుపరచడం జరుగుతుందని.. రాబోయే రోజుల్లో అన్ని వివరాలు అప్​డేట్​ చేస్తామన్నారు. కడప కలెక్టరేట్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి మలోల పాల్గొని జిల్లాలోని వక్ఫ్ బోర్డు ఆస్తుల వివరాలను త్వరలో సేకరించి స్వయంగా నివేదిస్తానని ఉపముఖ్యమంత్రికి నివేదించారు.

ఇవీ చూడండి : పోతిరెడ్డి సహా ఇతర ప్రాజెక్టులు ఆపకపోతే.. మేం ఆనకట్ట నిర్మిస్తాం: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.