కడప జిల్లా ప్రొద్దుటూరు - ఆర్టీపీపీ మార్గమధ్యంలో రోడ్డు కోతకు గురైంది. మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి వదిలిన నీటి ప్రవాహ ఉద్ధృతికి జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లె-పెద్దదండ్లూరు రహదారి కొట్టుకుపోయింది. సిరిగేపల్లె, పెద్దదండ్లూరు తదితర గ్రామాల ప్రజల రాకపోకలకు ఇదే ఆధారం. వాహనాలు అటు వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గత ఏడాదిన్నర క్రితం అదే స్థానంలో మట్టికట్ట కొట్టుకుపోగా 13 లక్షలతో ఆర్టీపీపీ అధికారులు తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేశారు. మట్టితో ఏర్పాటుచేసిన ఆ రోడ్డు మళ్లీ కోతకు గురైంది.
రహదారి కోతకు గురైన ప్రతిసారి ప్రజలు, విద్యార్థులు జమ్మలమడుగుకు రాకపోకలకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. రహదారి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి: