కడప జిల్లా కొండాపురం సమీపంలోని గండికోట జలాశయం ముంపు వాసుల సమస్యలు పరిష్కరించాలని వైకాపా నేత రామసుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో నాగన్నను కలిసి ముంపు వాసుల సమస్యలపై మాట్లాడారు. పునరావాస కాలనీల్లో ఇల్లు కట్టుకున్న వారికి లక్షా 86 వేల నగదు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని... ఆ నగదు కోసం 14 గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారని వివరించారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపి వారికి నగదు చెల్లించాలని కోరారు. సోషల్, ఎకనామికల్ సర్వేలో కొన్ని పేర్లు నమోదు కాలేదని... అలాంటి వారు సుమారు 700 మంది ఉన్నారని, వారిని గుర్తించి పరిహారం చెల్లించాలని కోరారు.
ఇదీ చదవండి