తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ జేఏసీ సంఘ నాయకులు ఆందోళనకు దిగారు కడప జిల్లా రాజంపేట విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. తొలుత విద్యుత్ అధికారి చంద్రశేఖరరావుకు వినతి పత్రం అందజేశారు. జేఏసీ కన్వీనర్ బాలాజీ మాట్లాడుతూ ఆర్టీపిీపీ నెల్లూరు ధర్మల్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 2020 విద్యుత్ సవరణను రద్దు చేయాలని కేంద్రానికి రాష్ట్రం లేఖ రాయాలని కోరారు. కరోనాతో మృతి చెందిన విద్యుత్ కార్మికుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల బీమా పరిహారం చెల్లించాలని కోరారు.
ఇవీ చూడండి...