కడప పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ సమావేశ మందిరంలో 2020 సంవత్సరానికి సంబంధించిన నేరాల వివరాలను జిల్లా పోలీసు అధికారి అన్బురాజన్ వెల్లడించారు. గడిచిన ఏడాది కన్నా 2020లో ఎర్రచందనం కేసులు పెరిగాయని తెలిపారు. మొత్తంగా 2019 కన్నా 2020లో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను కట్టడి చేశామని అన్బురాజన్ తెలిపారు. ముఖ్యంగా ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపి.. ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడంలో ఏమాత్రం వెనుకంజ వేయలేదన్నారు.
కడప జిల్లాలో వివిధ విభాగాల్లో నమోదైన కేసులు:
విభాగం | 2019 | 2020 |
రోడ్డు ప్రమాదాలు | 1320 | 1158 |
మృతులు | 540 | 447 |
ఎర్ర చందనం కేసులు | 48 | 54 |
అరెస్ట్ అయిన వారి సంఖ్య | 223 | 283 |
స్వాధీనం చేసుకున్న దుంగలు | 887 | 643 |
హత్యలు | 59 | 50 |
మహిళలపై వేధింపుల కేసులు | 818 | 638 |
ఇదీ చదవండి :