కడప జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. కడప, మైదుకూరు, పులివెందుల, ప్రోద్దుటూరు, రాజంపేట, జమ్మలమడుగు సబ్ డివిజన్ల పరిధిలో మెుత్తం 915 కేసులు నమోదు చేసి... రూ.2,11,330 జరిమానా విధించినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలు తమవంతు బాధ్యతను గుర్తించి పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. ఆరోగ్య సంరక్షణ ప్రజల చేతుల్లోనే ఉందని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో కచ్చితంగా భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.