కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12న జరిగిన హత్య కేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, 4 చరవాణులు, 3 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని డీఎస్పీ సునీల్ తన కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు.
కడప రవీంద్రనగర్‌కు చెందిన సయ్యద్ సంధానీ బాషాకు, కడప హబీబుల్లా వీధికి చెందిన షేక్ ఖాజా మొహియుద్దీన్‌కు.. రెండేళ్ల క్రితం గొడవ జరిగింది. అప్పటినుంచి మృతుడు షేక్ ఖాజాను చంపుతానని సయ్యద్ బెదిరించేవాడు. ఇటీవల ఓ పెళ్లిలో మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో పగ పెంచుకున్న షేక్ ఖాజా.. ఈనెల 12న సయ్యద్‌పై కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనలో భాగం పంచుకున్న 9 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి:
Jagan assets case: జగన్ అక్రమాస్తుల కేసు.. మరో 2 ఛార్జిషీట్లు దాఖలు