మద్యానికి బానిసైన వ్యక్తి మత్తు కోసం శానిటైజర్ తాగి మృతి చెందిన ఘటన కడపలో జరిగింది. కడప రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్న పురుషోత్తం కరెంట్ పనులు చేస్తుంటాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల మద్యం ధరలు భారీగా పెరగటంతో అతను కొనలేకపోయాడు. దాంతో మంగళవారం మత్తు కోసం శానిటైజర్ తాగాడు.
అస్వస్థతకు గురైన అతన్ని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.