గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చున్నా.... చాలా చోట్ల కరోనా టీకా రెండో డోస్ లభిస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. కడప జిల్లా జమ్మలమడుగులో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నగరపంచాయతీలో టీకా రెండో డోసు వేసేందుకు అనుమతి రాగా.... 200 మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నానికి కేవలం 30 మందే వచ్చారని... మిగతావారికి వైద్య సిబ్బంది ఫోన్ చేసినా ఇప్పటికి రాలేదని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:
22 జర్మన్ షెడ్ల నిర్మాణానికి తితిదే నిర్ణయం.. రూ. 3.52 కోట్లు మంజూరు