కడప జిల్లా బద్వేలు మండలం చెన్నంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనానంపై నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా మినీ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు కొంగలవీడు గ్రామానికి చెందిన ఈశ్వరుడిగా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి...