ETV Bharat / state

భవనం కూలి ఒకరు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు - rayachoti latest news

కడప జిల్లా రాయచోటి పట్టణంలో భవనం కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

building collapsed
కూలిన భవనం
author img

By

Published : Oct 31, 2020, 1:19 PM IST

కడప జిల్లా రాయచోటిలో జాతీయ రహదారి వద్ద భవనం కూలింది. ఇంట్లో ఉన్న వారు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీ సాయంతో శిథిలాలు తొలగించి బాధితులను బయటకు తీశారు. వారిని 108లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇంటి యజమాని అసఫ్ అలీ ఖాన్ (65) మరణించారు. ఆయన భార్య ప్యారీ జాన్ (60), కుమారుడు ముషారఫ్ అలీ ఖాన్(35) తీవ్రంగా గాయపడ్డారు.

కూలిన భవనం పురాతన మిద్దె అని స్థానికులంటున్నారు. పక్క భవనాన్ని​ బ్రేకర్​తో కొట్టడం ద్వారా పగుళ్లు వచ్చి కూలిపోయిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

పెన్నా సేతువు... ప్రమాద హేతువు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.