కరోనా నుంచి ప్రజలను సాధ్యమైనంతవరకు కాపాడామని, ఇకపై వైరస్ బారినుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని కడప డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. అన్ని ప్రార్థన మందిరాలకు సంబంధించిన మతపెద్దలతో పోలీసు, రెవెన్యూ అధికారులు... కడప పాత మున్సిపల్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇకనుంచి జాగ్రత్తగా ఉండాలని వారికి సూచించారు. ఆలయాలకు వచ్చే భక్తులు మాస్కులు ధరించే విధంగా నిర్వాహకులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మాస్కులు లేనిదే మందిరాల్లోకి అనుమతించవద్దని సూచించారు. ప్రార్థనా మందిరాలను ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కొంత కాలంపాటు ఆలింగనం, కరచాలనం చేసుకోవడం లాంటివి నిషేధించాలని కోరారు.