ఇదీ చదవండి:
రైల్వేకోడూరు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం కూలీ అరెస్టు - కడపలో ఎర్రచందంనం దుంగలు స్వాధీనం
కడప జిల్లా రైల్వే కోడూరులోని వై.కోట అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కూంబింగ్ చేస్తుండగా.. ఐదుగురు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. వారిని వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించగా అందరూ పారిపోయారని అందులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఆ వ్యక్తితో పాటు లక్ష రూపాయలు విలువ చేసే నాలుగు ఎర్రచందనం దుంగలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
అడవిలో కూంబింగ్.. ఓ వ్యక్తి అరెస్టు, ఎర్రచందనం స్వాధీనం
ఇదీ చదవండి: