2010 October 10 murder case in Kadapa district: వైయస్సార్ కడప జిల్లాలో 2010 అక్టోబర్ 10వ తేదీన జరిగిన హత్య కేసులో.. ఏడుగురు నిందితులకు జిల్లా సెషన్ కోర్టు ప్రథమ అదనపు న్యాయమూర్తి సీఎం మూర్తి.. జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. వేముల మండలం భూమయ్యపల్లెకు చెందిన మల్లారెడ్డి.. అక్టోబర్ 10వ తేదీ తన గ్రామంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన ఏడుగురు అతన్ని అడ్డగించి.. దాడి చేయడంతో మరణించాడు.
ఈ మేరకు ఏడుగురిపై హత్య కేసు నమోదు చేశారు. కేసు పలు దఫాలుగా వాయిదాకు రాగా.. ఈ రోజు జిల్లా సెషన్ కోర్టు ప్రథమ అదనపు న్యాయమూర్తి సీఎం మూర్తి.. కేసు పూర్వాపరాలు పరిశీలించి నేరం రుజువు కావడంతో మల్లెల రాజా, రాజు, గంగాధర్, వెంకటరమణ, నాగరాజు, గంగరాజు, గంగాధర్లకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.
ఇవీ చదవండి: