ETV Bharat / state

ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం.. కల్తీ విత్తనాలను నివారించడమే లక్ష్యం : సీఎం జగన్ - నేచురల్​ ఫార్మింగ్

ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు త్వరలో ఇండోజర్మన్​ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్​ వెల్లడించారు. రాష్ట్రంలోని 10,700 ఆర్బీకేల్లో ఆగ్రో ఎకాలజీపై పరిశోధన చేసిన నిపుణులను నియమిస్తామన్నారు. ప్రకృతి సాగు ద్వారా రసాయనాల వినియోగం ముప్పును తప్పించుకోవచ్చని, పెట్టుబడిని తగ్గించుకోవచ్చని వివరించారు.

జగన్
జగన్
author img

By

Published : Jul 8, 2022, 5:38 AM IST

ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ఇండోజర్మన్‌ గ్లోబల్‌ అకాడమీ ఫర్‌ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్‌ అండ్‌ లెర్నింగ్‌ (ఐజీజీఏఏఆర్‌ఎల్‌)ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. రైతులకు నైపుణ్యాన్ని అందించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలను వారికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పులివెందులలో న్యూటెక్‌ బయోసైన్సెస్‌కు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.

సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు కల్తీ విత్తనాలు, ఎరువులను నివారించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని 10,700 ఆర్బీకేల్లో ఆగ్రో ఎకాలజీపై పరిశోధన చేసిన నిపుణులను నియమిస్తామన్నారు. ప్రకృతి సాగు ద్వారా రసాయనాల వినియోగం ముప్పును తప్పించుకోవచ్చని, పెట్టుబడిని తగ్గించుకోవచ్చని వివరించారు. ప్రకృతి సేద్యంలో డిగ్రీ, పీజీతో పాటు పీహెచ్‌డీలు అందిస్తామన్నారు. ఈ విద్యార్థులకు ప్రపంచం మొత్తం ఆహ్వానం పలుకుతుందన్నారు. పులివెందుల ఏపీకార్ల్‌గా ఉన్న పరిశోధనా స్థానం త్వరలోనే విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంటుందన్నారు. కార్యక్రమంలో మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌, రైతు సాధికార సంస్థ ఛైర్మన్‌ విజయ్‌కుమార్‌, కలెక్టరు విజయరామరాజు, నీతి ఆయోగ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : "మమ్మల్ని గొర్ల మంద అంటారా..? మంత్రికి గుణపాఠం తప్పదు"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.