కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటపై కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం పడింది. నిత్యం పర్యటకులు, ప్రజలతో కళకళలాడే గండికోట.. నేడు వెలవెలబోతోంది. ప్రతి శని, ఆదివారాల్లో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి భారీగా పర్యటకులు తరలివచ్చేవారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో కోట నిర్మానుష్యంగా మారింది. ఈ పరిస్థితి ఇంకెనాళ్లు కొనసాగుతుందో అర్థం కాకుండా ఉంది.
ఇదీ చదవండి: నిర్మానుష్యంగా కడప పుణ్యక్షేత్రాలు