కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈ మేరకు కడప జిల్లాలోని ఆర్టీసీ బస్ స్టాండు నిర్మానుష్యంగా మారింది. జిల్లాలోని 8 డిపోల పరిధిలో.. కేవలం 30 శాతం బస్సు సర్వీసులను మాత్రమే నడుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 720 బస్సులు ఉండగా.. కేవలం 222 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో రూ. 22 లక్షలు ఆదాయం మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు.
గతంలో రోజుకు 700 బస్సు సర్వీసులు నడపడంతో.. సుమారు రూ.కోటి ఆదాయం వచ్చేది. ఇప్పుడు దాదాపు 80 శాతానికి పడిపోయింది. బస్టాండ్లో రెండు వారాల పాటు ముందస్తు రిజర్వేషన్లు రద్దు చేశారు. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి డబ్బులను వెనక్కి ఇస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేశారు.
ఇదీ చదవండి: