రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని ఎన్జీటీ పునరుద్ఘాటించింది. పర్యావరణ అనుమతుల్లేకుండా ముందుకెళ్లొద్దని మరోసారి స్పష్టం చేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. తెలంగాణవాసి గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారణ జరిపింది. పిటిషనర్ అభ్యంతరాలపై సమాధానం ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఆదేశించింది.
నిజనిర్ధరణ కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా.. ఆ వినతిపై వివరణ ఇవ్వాలని బోర్డుకు ఎన్జీటీ స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 24కి వాయిదా పడింది.
ఇదీ చదవండి: ఆంగ్లమాధ్యమంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ