కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలో ట్రాన్స్ఫార్మర్ పేలి ఓ వ్యక్తికి లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది. వంశీ స్లాబ్స్ పాలిషింగ్ యూనిట్ దగ్గర్లోని ట్రాన్స్ఫార్మర్లో నుంచి పొగలు వస్తున్నాయని దాని లీజ్దారు శివారెడ్డి విద్యుత్తు సిబ్బందికి సమాచారం అందించారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో విద్యుత్తు నియంత్రిక పేలింది. దాని పక్కనున్న లక్షలు విలువ చేసే పాలిషింగ్ మిషన్ కాలిపోయింది. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బాధితుడు ఆరోపించారు. వారే తనకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశాడు.
![Neglect of electricity officials at erra guntla kadapa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9537420_917_9537420_1605277925692.png)
ఇదీ చదవండి: