కడప జిల్లా ఎస్పీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సెల్ఫీ వీడియో బాధితుడిని పరామర్శించటానికి గత నెల 11వ తేదీన వచ్చిన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీని.. పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా తనను అరెస్టు చేశారని ఫారూక్.. ఎన్‌హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ.. ఈ ఘటనపై ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కడప ఎస్పీకి నోటీసులు జారీ చేసింది.
ఏం జరిగిందంటే..
కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లెలో పోలీసులు వేధిస్తున్నారని ఓ మైనారిటీ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. మైదుకూరు గ్రామీణ సీఐ వేధిస్తున్నారని అక్బర్ బాషా కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. న్యాయం జరగపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. అక్బర్ బాషా కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ముస్లిం నేషనల్ మానవ హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఫారుక్ షిబ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సంబంధిత కథనాలు
వీడియో వైరల్: సీఐ వేధిస్తున్నాడని ఆ కుటుంబం ఏం చేసిందంటే..!
selfie video viral: మాట వినకపోతే ఎన్‌కౌంటర్ చేస్తానన్నారు..యువకుడి సెల్ఫీవీడియో