కడప జిల్లా జమ్మలమడుగులో వెలిసిన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొవిడ్ నిబంధనల నడుమ ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం నారాపుర ఆలయంలో.. అర్చకులు భక్తిశ్రద్ధలతో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తితిదే పాలకమండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్ హాజరయ్యారు.
ఈ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ నెల 28న కల్యాణోత్సవం, 29న రథోత్సవం ఉంటాయని.. ఈ కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: