సీఎం జగన్ సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ కొరవడిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. పులివెందుల నియోజకవర్గంలో ఎస్సీ మహిళను అత్యాచారం చేసి.. కిరాతకంగా హత్య చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని లోకేశ్ ఆరోపించారు. చట్టాల పేరు చెబుతూ కాలయాపన తప్ప నిందితులను శిక్షించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: పెద్దకుడాల గ్రామంలో మహిళ దారుణ హత్య