Nara Lokesh: బాబాయ్‌ని ఒప్పించి అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు ఇస్తే నాయకుడిని అవుతానని, బాబాయ్‌ని లేపేసి అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు ఇస్తే నేరస్తుడిని అవుతాననే చిన్న లాజిక్‌ని సీఎం జగన్ ఎలా మిస్సయ్యారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. వివేకాని అత్యంత కిరాతకంగా చంపించింది అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అని.. వారిని కాపాడుతున్నది జగన్ రెడ్డి అని సొంత చెల్లి షర్మిల సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చారని లోకేశ్ తెలిపారు. హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు.. అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అని జగన్ వదిలిన బాణం సమాధానం ఇచ్చిందని లోకేశ్ అన్నారు.
ఇవీ చదవండి: