ETV Bharat / state

'పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలు' - అనంతపురంలో ముస్లింల ధర్నా న్యూస్

సీఏఏ, ఎన్​ఆర్​సీ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ... ముస్లిం సంఘాల నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును అమలులోకి తెస్తోందని నిరసనలు వ్యక్తం చేశారు.

.
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలు
author img

By

Published : Jan 3, 2020, 9:05 PM IST

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలు

సీఏఏ, ఎన్​ఆర్​సీ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రలోని పలు ప్రాంతాలలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు.

కడప జిల్లాలో...
భారతదేశంలోని ముస్లింలకు ఇబ్బంది కలిగించే సీఏఏ, ఎన్​ఆర్​సీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ... ముస్లిం జాయింట్ యాక్షన్ సంఘం నాయకులు కడపలో ధర్నా నిర్వహించారు. స్థానిక ఏడు రోడ్ల కూడలి వద్ద ఈ చట్టాలకు వ్యతిరేకంగా మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఏఏ, ఎన్​ఆర్​సీ వల్ల తమ జీవన విధానంపై పెను ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లాలో...
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నెల్లూరులో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బారా షహీద్ దర్గా నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు జాతీయ జెండాలతో ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీలో జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని తమ మద్దతు ఇచ్చారు. ముస్లింలకు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రకటించారు.

చిత్తూరు జిల్లాలో...
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా పీలేరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కృష్ణా జిల్లాలో..
ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​, సీఏఏ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దని డిమాండ్ చేస్తూ... విజయవాడలో ముస్లిం మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నగరంలోని పంజా సెంటర్ నుంచి ధర్నా చౌక్ వరకు వేలాదిగా ముస్లింలు నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ అమలు చేయబోమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లాలో..
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును అమలులోకి తెస్తోందని అనంతపురం జిల్లా గాండ్లపెంటలో ముస్లింలు ధర్నా చేపట్టారు. కదిరి-రాయచోటి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పౌరసత్వ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: సీఏఏకి అక్కడ మద్దతు... ఇక్కడ వ్యతిరేకత..!

Intro:ap_cdp_19_03_caa_nrc_nirasana_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
భారతదేశంలోని ముస్లింలకు ఇబ్బంది కలిగించే సి ఏ ఏ, ఎన్ ఆర్ సి చట్టాలను తక్షణం రద్దు చేయాలని ముస్లిం జాయింట్ ఆక్షన్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. చట్టాలకు వ్యతిరేకంగా కడప ఏడురోడ్ల కూడలి వద్ద ముస్లిం సోదరులు మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ చట్టాల వల్ల ముస్లిం సోదరుల జీవనం విధానంపై పెను ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. కానీ బిజెపి ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేయాలని లేదంటే ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు.

Body:చట్టాలకు నిరసన

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.