కడప జిల్లా జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జమ్మలమడుగు నగర పంచాయతీ 18వ వార్డు కౌన్సిలర్‌గా వైకాపాకు చెందిన ఇస్మాయిల్.. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కొందరు వైకాపా నాయకులు అతన్ని నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని కోరగా ఆయన నిరాకరించారు. రెండు రోజుల క్రితం దేవగుడికి వెళ్లిన భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి.. ఇస్మాయిల్‌ను కలిశారు.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే భాజపా మద్దతు ఇస్తుందని ఆయనకు హామీ ఇచ్చారు. ఈ పరిణామాల మధ్య ఇస్మాయిల్ తల్లి గౌసియా తన కుమారుడు కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవగుడిలో ఇస్మాయిల్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతణ్ని స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న వైకాపా, భాజపా నాయకులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు తరలి వచ్చారు. జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఇదీ చదవండి: