ETV Bharat / state

Mother Died in a Road Accident తండ్రి చనిపోయి ఏడాది కాలేదు. రాఖీ కట్టించెందుకు పిల్లలతో వెళ్లి తల్లి మృతి! - Disappear in the middle of the night

Mother Died in a Road Accident while Ttaking her Children to tie Rakhi: రాఖీ పండగ రోజు రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసు కుంది. సోదరి చేత రాఖీ కట్టించెందుకు ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి తిరిగి వస్తుండా.. అటుగా వస్తున్న లారీ వచ్చి వారిని ఢీ కొట్టింది. తల్లి మృతి చెందగా ఇద్దరి పిల్లలలో ఒకరిగి గాయాలు అయ్యాయి. ఈ మధ్యనే ఆ పిల్లల తండ్రి చనిపోగా ఇప్పుడు తల్లి కూడా మృతి చెందడంతో వారు అనాధలయ్యారు. మరోచోట తల్లి పక్కలో నిద్రిస్తున్న చిన్నారి అర్ధరాత్రి అదృశ్యమంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులను కేసు నమోదు చేసుకుని బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

mother_died_in_a_road_accident
mother_died_in_a_road_accident
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2023, 11:28 AM IST

Mother died in a road accident while taking her children to tie Rakhi: రాఖీ పౌర్ణమి రోజు విషాదం చోటుచేసు కుంది. సోదరి చేత రాఖీ కట్టించెందుకు ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చింది. సంతోషంగా ఆ ఇద్దరు పిల్లలు తన సోదరి చేత రాఖీలు కట్టించుకుని తిరిగి బయలుదేరుతుండగా లారీ మృత్యు రూపంలో వచ్చి ఆ ఇద్దరు పిల్లల తల్లిని కబలించింది. ఆ ఇద్దరు పిల్లలలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలానికి చెందిన కృష్ణవేణి తన ఇద్దరు కుమారులైన తేజ్ కుమార్, మరొక కుమారుడిని వెంటపెట్టుకొని కడప గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తన బావ కుమార్తె చేత తన ఇద్దరు పిల్లలకు రాఖీ కట్టించేందుకు ఆమె 30 కిలోమీటర్ల దూరం నుంచి బయలుదేరింది.

Three Family Members Died in Road Accident: అంత్యక్రియలకు వెళ్లొస్తూ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Son Tej Kumar was seriously injured: తన బావ కుమార్తె చేత కృష్ణవేణి తన ఇద్దరు పిల్లలకు రాఖీలు కట్టించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు పాఠశాలలో నుంచి బయటికి వచ్చి రోడ్డు దాటుతుండగా భాకరాపేట వైపు నుంచి లారీ వచ్చి కృష్ణవేణిని ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణవేణి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె ఐదేళ్ల కుమారుడైన తేజ్ కుమార్​కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన తేజ్ కుమార్​ను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. కాకపోతే కృష్ణవేణి భర్త ఏడాది క్రిందటి అనారోగ్యంతో మృతి చెందాడు ఇప్పుడు తల్లి కూడా మృతి చెందడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాధలు అయ్యారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Volunteer Attacked on Boy వాలంటీర్​ ఘాతుకం.. సిగరెట్లు తీసుకురాలేదని బాలుడ్ని డాబాపై నుంచి తోశాడు!

Child is Missing in Prakasam District: తల్లి పక్కలో నిద్రిస్తున్న చిన్నారి అర్ధరాత్రి అదృశ్యమైన ఘటన ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలో చోటుచేసుకుంది. బాలుడి తల్లి ఫిర్యాదుతో పోలీస్ యంత్రాంగం ముమ్మరగాలింపు చేపట్టారు. చంద్రశేఖరపురం మండలం చింతలపాలెం గ్రామంలో సాత్విక్ అనే ఏడాదిన్నర చిన్నారి తల్లి పక్కలో నిద్రిస్తుండగా అర్ధరాత్రి అదృశ్యమయ్యాడు. గ్రామానికి చెందిన తండ్రి సామేలు బేల్దారి పనుల నిమిత్తం తెలంగాణ రాష్ట్రంకు వెళ్లగా చిన్నారి తల్లి అమ్మమ్మలతో కలిసి గ్రామంలోని ఇంటి వద్దనే ఉంటున్నారు. రోజుటి మాదిరిగానే తల్లి చిన్నారి సాత్విక్​కు పాలు పట్టించి ఇంటి వరండాలో ఇద్దరు నిద్రపోయారు.

Missing Two Year Old Boy Case Ends in Tragedy : ఇంటి ముందు మురికి గుంత ఊపిరితీసింది.. ఆడుకుంటూ వెళ్లి రెండేళ్ల బాలుడు మునక..

తల్లి కేజియ అర్ధరాత్రి నిద్రలేచి చూడగా చిన్నారి పక్కన లేకపోవడంతో ఆందోళనకు గురైంది. తన కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో గ్రామంలోని చుట్టుపక్కల ప్రాంతాలను వెతికారు. అయినప్పటికీ పిల్లవాడి ఆచూకీ లభించకపోవడంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్​లో తల్లి ఫిర్యాదు చేసింది. డీఎస్పీ రామరాజు ఆధ్వర్యంలో పోలీసులు చుట్టుపక్కల గ్రామాలలో గాలింపు చేపట్టారు. అనంతరం క్రైమ్ ఏఎస్పీ శ్రీధర్ ఘటనా స్థలికి చేరుకొని పోలీసులను పలు బృందాలుగా విభజించి బాలుడి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.